ఉత్తరప్రదేశ్‌లో భూకంపం.. ఢిల్లీలో కూడా..

tremors-delhi-after-earthquake-occurred-uttar-pradesh

ఉత్తరప్రదేశ్‌లో ఈ వేకువజామున (సోమవారం) భూకంపం సంభవించింది. రిక్టర్‌ స్కేలుపై 3.6గా నమోదైంది. ఉత్తరప్రదేశ్ లోని మీరట్‌ నుంచి 6 కిలోమీటర్ల దూరంలో గల ఖర్కౌదాలో భూకంప కేంద్రాన్ని కనుగొన్నారు. ఉత్తరప్రదేశ్ లో భూమి కంపించడంతో దీని ప్రభావం వల్లఢిల్లీలో భూప్రకంపనలు సంభవించాయి. ఢిల్లీలో కొన్ని సెకన్లపాటు భూమి కంపించడంతో ఇళ్లలో ఉన్న ప్రజలు భయంతో బయటకు వచ్చేసారు. భూకంపం సంభవించినా ఎటువంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగలేదు. కాగా ఆదివారం మధ్యాహ్నం హర్యానాలోని జజ్జర్‌ జిల్లాలో సంభవించిన భూకంపం వల్ల ఢిల్లీలో కూడా భూమి స్వల్పంగా కంపించింది. గడిచిన 24 గంటల్లో ఇలా జరగడం రెండోసారని అమెరికా జియోలాజికల్‌ సర్వే తెలిపింది.