ఇంధన ధరల పెంపునకు కారణం ఆ ఇద్దరే..: ఉత్తమ్

tpcc-chief-uttham-kumar-reddy-fire-over-pragathi-nivedhana-sabha

దుర్మార్గమైన కేసీఆర్‌ సర్కార్‌కు వ్యతిరేకంగా అన్ని రాజకీయ పార్టీలు కలవాలని పీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి పిలుపునిచ్చారు. త్వరలోనే పార్టీలతో పొత్తులపై చర్చిస్తామని ఆయన తెలిపారు. తిరిగి కేసీఆర్‌ అధికారంలోకి రాకుండా విద్యార్థి, మహిళా సంఘాలు కలిసికట్టుగా పోరాడాలన్నారు.

అటు.. ఇంధన ధరల పెంపు, రూపాయి పతనం మోడీ వైఫల్యమేనని పీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి అన్నారు. ఇంధన ధరల పెంపునకు మోడీ, కేసీఆర్‌ ఇద్దరూ కారణమేనని విరుచుకుపడ్డారు. వీరి హయాంలో గ్యాస్‌ ధరలు రెట్టింపయ్యాయన్నారు. గతంలో 3.5 శాతమున్న ఎక్సైజ్‌ సుంకాన్ని.. 15 శాతానికి పెంచారని ఉత్తమ్ విరుచుకుపడ్డారు.