మరిది చేతిలో గాయపడి వదిన మృతి

woman-died-knife-attack-prakasam

మరిది చేతిలో గాయపడి వదిన మృతిచెందింది. ఈ ఘటన ప్రకాశం జిల్లాలో జరిగింది. పీసీపల్లికి చెందిన పులవర్తి రమణమ్మకు ఇద్దరు కుమారులు. తనకున్న 12 సెంట్ల పొలం పొలాన్ని పెద్ద కుమారుడు వెంకటేశ్వర్లు భార్య శేషారత్నమ్మకు రాసి ఇచ్చింది రమణమ్మ. అయితే ఈ పరిణామం చిన్న కుమారుడు తిరుపతయ్యకు రుచించలేదు. దాంతో అన్నా వదినలపై కక్ష పెంచుకున్నాడు. ఇటీవల ఈ వ్యవహారంపై గొడవ జరిగి తిరుపతయ్య తన అన్నావదినాలపై కత్తితో దాడి చేశాడు. ఈ దాడిలో శేషారత్నం తీవ్రంగా గాయపడింది. దీంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శేషారత్నం మృతిచెందింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.