కొండ‌గ‌ట్టు రోడ్డు ప్రమాదంలో 51 మంది మృతి

కొండగట్టు ఘాట్ రోడ్డులో ప్రమాదంలో మృతుల సంఖ్య అంతకంతకు పెరుగుతోంది. ఇప్పటివరకు ఈ ప్రమాదంలో 51 మంది మృతి చెందగా మరో 12 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు.మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. పోలీసు సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. బస్సులో చిక్కుకున్న వారిని వెలికితీస్తున్నారు. బస్సులో 86 మంది ప్రయాణీకులు టికెట్లు తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. ఎస్పీ సింధూ శర్మ, కలెక్టర్ శరత్ సంఘటనాస్థలానికి చేరుకొని పరిస్థితిని సమీక్షిస్తున్నారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని కేసీఆర్ అధికారులను ఆదేశించారు

- ఉచితంగా మీ జాతకాన్ని తెలుసుకోండి -