పార్క్ హయత్‌‌లో కాంగ్రెస్-టీడీపీ నేతల భేటీ

తెలంగాణలో కాంగ్రెస్-టీడీపీ చేతులు కలుపుతాయా? ఆ రెండు పార్టీల నాయకులు పార్క్ హయత్‌ హోటల్‌లో సమావేశం అవుతున్నారు. కాంగ్రెస్‌ నుంచి పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌ కుమార్ రెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ భట్టి విక్రమార్క, సుధీర్‌రెడ్డి హాజరు కాగా… టిటీడీపీ నుంచి ఎల్.రమణ, పెద్దిరెడ్డి, నామా నాగేశ్వర్‌రావు పాల్గొన్నారు. కేసీఆర్‌ను ఓడించడమే లక్ష్యంగా మహా కూటమి ఏర్పాటులో భాగంగా సీపీఐ నాయకులు కూడా ఈ భేటీకి వచ్చారు. ఆ పార్టీ నుంచి చాడ వెంకట్‌రెడ్డి, పల్లా వెంకట్‌రెడ్డి చర్చల్లో పాల్గొంటున్నారు. తెలంగాణ పీసీసీ- టి.టీడీపీ అధ్యక్షుల మధ్య ఇప్పటికే ఓ రౌండ్ చర్చలు పూర్తయ్యాయని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో.. సీట్ల షేరింగ్‌పై ప్రధానంగా దృష్టి పెట్టినట్టు తెలుస్తోంది. కొన్ని నియోజకవర్గాల్లో రెండు పార్టీలకు బలమైన నాయకులు ఉన్నందున ఆ సెగ్మెంట్లలో ఎలాంటి వ్యూహంతో ముందుకెళ్లాలో కూడా దృష్టి సారించారు.

- ఉచితంగా మీ జాతకాన్ని తెలుసుకోండి -