కట్టి మూడు నెలలే అయింది.. కళ్ల ముందే కూలిన బ్రిడ్జి

అధికారుల అవినీతికి దర్పణం.. ఓ కొత్త వంతెన నిర్మించిన మూడు నెలలకే పేక మేడలా కూలిపోయింది. కళ్ల ముందే నీటిలో కొట్టుకుపోయింది. మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని శివపురి జిల్లాలోని కునో నదిపై 7.78 కోట్ల రూపాయలతో వంతెన నిర్మించారు. భారీ వర్షాల కారణంగా వంతెన కూలిపోయింది. మధ్యప్రదేశ్-రాజస్థాన్ రాష్ట్రాలను కలుపుతూ సరిహద్దుల్లో నిర్మించిన ఈ వంతెనను కేంద్ర మంత్రి నరేంద్రసింగ్ తోమార్ ఈ ఏడాది జూన్ 29వ తేదీన ప్రారంభిచారు. నిర్మాణంలో నాణ్యతా ప్రమాణాలు పాటించకపోవడం వల్లే వంతెన కూలిపోయిందని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. స్థానిక ఎమ్మెల్యే ప్రహ్లాద్ భారతి విధానసభలో ఈ అంశాన్ని లేవనెత్తారు.

Recommended For You

Leave a Reply

Your email address will not be published.

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.