కేసీఆర్ కుటుంబానికి చట్టాలు వర్తించవా?

కేసీఆర్ కుటుంబానికి చట్టాలు,సెక్షన్లు వర్తించవా అని మంద కృష్ణ మాదిగ ప్రశ్నించారు. గత మిలియన్ మార్చ్‌లొ ఎన్నో కేసులు నమోదు అయ్యాయని వాటిపై ఎందుకు అరెస్టు చేయడం లేదన్నారు.రాష్ట్రంలో జరిగిన అరాచక పాలనపై ప్రజలకు వివరించే ప్రయత్నమే ప్రజాగ్రహా మహాసభ అన్నారు.దీనికి అన్ని రాజకీయ పార్టీలు,ప్రజాసంఘాలు రావాలని పిలుపు నిచ్చారు.ఇక త్యాగాల పునాదులపై వచ్చిన తెలంగాణలో త్యాగాలు ఒకరివి..భోగాలు మరొకరివి అని చెరుకు సుధాకర్ అన్నారు.ప్రగతి నివేదన మోసానికి ప్రత్యామ్నాయం చూపిస్తామన్నారు. బంగారు తెలంగాణ అనేది ఓ మోసం అన్నారు.

- ఉచితంగా మీ జాతకాన్ని తెలుసుకోండి -