అడ్డదారే 45 మంది ప్రాణాలు తీసింది.. కొండగట్టు ఘటన

ఆర్టీసీ అధికారుల నిర్లక్ష్యమే నిండు ప్రాణాలను బలి తీసుకుంది. బస్సు బ్రేకులు ఫెయిలవ్వడం ఒకటైతే, డ్రైవర్ అడ్డదారిలో పోనివ్వడం మరో తప్పు. కేవలం బైకులు ప్రయాణించడానికి మాత్రమే అనుమతి ఉన్న రోడ్డులోకి కెపాసిటీ 40 మంది అయితే 80 మంది ప్రయాణీకులను ఎక్కించుకుని ప్రమాదానికి కారణమైంది. హెవీ వెహికల్స్ ప్రయాణించకూడదంటూ హెచ్చరిక బోర్డులు జారీ చేసినా ఖాతరు చేయలేదు. మూడు నెలల నుంచి బరువైన వాహనాలు ఆ రూట్లో తిరుగుతున్నాయి. ఘాట్ రూట్ నుంచి
హైవేపైకి కిలోమీటర్ దూరం ఉంటుంది. మరో రోడ్డులో వెళితే 5 కిలోమీటర్లు ఎక్కువ దూరం ప్రయాణించాల్సి వస్తుందని డ్రైవర్లు అడ్డదారిలో ప్రయాణిస్తుంటారు. ఘాట్‌రూట్‌కి ఇరువైపులా గోడను నిర్మించాలని ఉన్నా ఇంతవరకు ఆ దిశగా చర్యలు తీసుకోలేదు. ప్రమాదానికి గురైన వారిలో 25 మంది మహిళలు, 7గురు చిన్నారులు ఉన్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.