తెలంగాణలో ఎన్నికల నిర్వహణపై ఈసి కసరత్తు

తెలంగాణలో ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లపై కేంద్ర ఎన్నికల సంఘం దృష్టి పెట్టింది. సీఈసీ ప్రతినిధుల బృందం హైదరాబాద్ చేరుకుంది. సచివాలయం సౌత్ బ్లాక్ మొదటి అంతస్తులోని సీఈవో కార్యాలయంలో అన్ని రాజకీయ పార్టీలతో సమావేశం కానున్నారు. ఆరున్నర గంటలకు రావాలంటూ అన్ని పార్టీలను ఆహ్వానించారు. ఒక్కోపార్టీ నుంచి ఇద్దరూ లేదా ముగ్గురు ప్రతినిధులు రావచ్చన్న ఈసీ.. ప్రతీపార్టీకి 10 నిమిషాలు కేటాయించింది. పార్టీలకు కేటాయించిన సమయానికి పావు గంట ముందే రావాలని సూచించింది. బిజీ షెడ్యూల్ నేపథ్యంలో కేటాయించిన సమయం కంటే అదనపు సమయం ఇవ్వడం కుదరదని కేంద్ర ఎన్నికల కమిషన్ స్పష్టం చేసింది.