దగ్గరకు వచ్చిన మగ పామును ఆడ పాము ఏమి చేసిందంటే..

fighting-snakes-fall-through-ceiling

పాములు ఎక్కువగా చల్లని ప్రదేశాలలో సంభోగంలో పాల్గొంటాయనే నానుడి ఉంది. అంతేకాకుండా జనాలకు కనిపించకుండా అవి కలుస్తాయి. అరుదుగా అవి మనిషి కంటపడతాయి. అయితే ఆ సమయంలో వాటివైపునకు చూడకూడదు అని మన పెద్దవాళ్ళు చెబుతారు. ఇదిలావుంచితే.. రెండు పాములు సంభోగంలో పాల్గొన్నాయి. ఓ మహిళ ఆ దృశ్యాన్ని ఏకకంగా లైవ్ వీడియో తీసి సామజిక మాధ్యమాల్లో షేర్ చేసింది. ఈ ఘటన అర్జన్టీనాలో జరిగింది. అర్జన్టీనాకు చెందిన ఎలిజిబెత్ తన ఇంట్లో కలియతిరుగుతోంది. ఇంతలో సడన్ గా తన బెడ్ రూములోకి రెండు పాములు వచ్చాయి. దాంతో భయాందోళన చెందిన ఎలిజిబెత్ స్నేక్ క్యాచర్ కు సమాచారం ఇచ్చింది. అతను వెంటనే అక్కడికి చేరుకొని వాటిని పట్టుకునే ప్రయత్నం చేశాడు. కానీ అందులో ఒకటి అతనిమీదకు దూకే ప్రయత్నం చేయడంతో అతను వెనక్కి తగ్గాడు. మెల్లగా మగపాము ఆడపాముతో సంభోగానికి ప్రయత్నిస్తోంది. అయితే అది ఆడపాముకు నచ్చలేదు. దీంతో మగపాముపై తీవ్రంగా దాడి చేసింది. ఈ క్రమంలో తన తలతో మగపామును కొట్టి కొట్టి అక్కడినుంచి జారుకునేలా చేసింది. చివరకు అవి రెండు వెళ్లిపోవడంతో స్నేక్ క్యాచర్ కు పెద్దగా పనిలేకుండా పోయింది . ఈ తతంగాన్ని ఎలిజిబెత్ వీడియో తీసి స్నేహితులకు లైవ్ పెట్టడంతో వైరల్ గా మారింది.