భాగ్యనగరంలో భారీ వర్షం

హైదరాబాద్‌ను వరుణుడు ముంచెత్తాడు. మధ్యాహ్నం భానుడు మాడు పగలకొట్టగా.. సాయంత్రానికి వాతావరణం మారిపోయింది. ఒక్కసారిగా మబ్బులు కమ్ముకున్నాయి. చూస్తున్నంతలోనే భారీ వర్షం కురిసింది.ఆఫిస్ నుంచి ఇంటికి వెళ్ళె సమయం కావడంతో ట్రాఫిక్ భారీగా నిలిచిపోయింది.రోడ్లపై
భారీగా వరద నీరు నిలిచిపోవడంతో జిహెచ్ఎంసి అధికారులు అప్రమత్తమయ్యారు.