బ్రేకింగ్ : కొండగట్టు ఘాట్‌రోడ్‌లో ఘోర రోడ్డుప్రమాదం…30 మంది మృతి

huge road accident in kondagatu ghatroad

జగిత్యాల జిల్లా కొండగట్టు ఘాట్‌రోడ్డులో ఆర్టీసీ బస్సు బోల్తా పడింది. ఈ దుర్ఘటనలో 30 మంది మృతి చెందారు. మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. బస్సు ఘాట్‌రోడ్డు దిగుతుండగా బ్రేక్ ఫెయిల్ అవడం వల్లే యాక్సిడెంట్ జరిగిందా, లేక డ్రైవర్ నిర్లక్ష్యం వల్ల ఈ యాక్సిడెంట్ జరిగిందా అన్నదానిపై ప్రస్తుతానికి స్పష్టత లేదు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం కనిపిస్తోంది. ప్రమాద సమయంలో బస్సులో 60 మంది ఉన్నారు. మరో నిమిషంలో ఘాట్‌రోడ్డు నుంచి బస్సు.. మామూలు రహదారికి వచ్చేస్తుందన్న సమయంలో ఈ పెను విషాద ఘటన చోటుచేసుకుంది. ప్రస్తుతం బస్సులో ఇరుక్కున్న వారిని కాపాడేందుకు ఆర్టీసీ సిబ్బంది, పోలీసులు, స్థానికులు ప్రయత్నం చేస్తున్నారు. ప్రమాద విషయం తెలియగానే డిపోకి సంబంధించిన సిబ్బంది కూడా హుటాహుటిన స్పాట్‌కు చేరుకున్నారు. లోపల ఇంకొందరు చిక్కుకుని ఉండడంతో వారిని కాపాడేందుకు ప్రయత్నం చేస్తున్నారు. తీవ్రంగా గాయపడ్డ వారిని దగ్గరలోని ప్రైవేటు ఆస్పత్రులకు తరలిస్తున్నారు.

కొండగట్టు నుంచి బస్సు జగిత్యాల వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ దుర్ఘటన పట్ల ఆపద్ధర్మ సీఎం కేసీఆర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రవాణా మంత్రి మహేందర్‌రెడ్డి ప్రమదానికి కారణాలపై అధికారులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. గాయపడ్డవారికి మెరుగైన వైద్యం అందించాలని సూచించారు. అటు మహేందర్‌రెడ్డి, ఈటల రాజేందర్ కూడా ప్రమాద విషయం తెలియగానే స్పాట్‌కి బయలుదేరి వెళ్లారు.

అటు, డ్రైవర్ తప్పిందం వల్లే ప్రమాదం జరిగి ఉండొచ్చని డిపో మేనేజర్ చెప్తున్నారు. ప్రస్తుతం సహాయ చర్యలు కొనసాగుతున్నాయంటున్నారు. మృతుల్లో చిన్నారులు, మహిళలు, వృద్ధులే ఎక్కువ మంది ఉన్నారు. 30 మందికిపైగా చనిపోవడంతో ఆ ప్రాంతం బాధితుల ఆర్తనాదాలతో హృదయవిదారకంగా ఉంది. కొండగట్టు అంజన్న దర్శనం కోసం వచ్చి తిరిగి వెళ్తున్న వారితోపాటు.. స్థానికులు కూడా ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. బాధిత కుటుంబాన్ని ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటామని రవాణా మంత్రి చెప్తున్నారు. గాయపడ్డవారికి మెరుగైన వైద్యం అందించేందుకు కరీంగనర్ ప్రైవేట్ ఆస్పత్రులకు తరలిస్తున్నట్టు వివరించారు.