తవ్వకాల్లో భారీగా బంగారం.. నాణేల నిధి వెలుగులోకి..

పురావస్తు తవ్వకాలు పూర్వీకుల సమాచారాన్ని వెలుగులోకి తెస్తాయి. ప్రపంచానికి వేలఏళ్ల నాటి మనిషి మనుగడను, వారి గురుతులను పరిచయం చేస్తాయి. పరిశోధకులకు ఒక్కోసారి విస్తుపోయే సమాచారంతో పాటు భారీగా నిధులు కూడా కనిపించి ఆశ్చర్యానికి గురిచేస్తాయి. ఉత్తర ఇటలీలోని ఓ పాత థియేటర్ తవ్వకాల్లో బంగారు నాణేల నిధిని శాస్త్రవేత్తలు గుర్తించారు.

ఇటలీలోని ఓ ప్రాంతంలోని తవ్వకాల్లో వందల సంఖ్యలో రోమన్ బంగారు నాణేలు లభించాయని ఇటలీ సాస్కృతిక మంత్రిత్వ శాఖ ప్రకటించింది. వీటి ఖరీదు మిలియన్ డాలర్లు వుండవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. 4,5వ శతాబ్దంలో రోమన్ కాలం నాటి 300 నాణేలు వెలుగులోకి వచ్చాయి.

క్వింగ్ రాజవంశానికి చెందిన రాతి కూజాలో బంగారు పట్టీతో పాటు, 19 మిలియన్ డాలర్ల విలువైన నాణేలను వెలికి తీసారు. ప్రమాదం జరిగినప్పుడు ముందు జాగ్రత్త చర్యగా నాణేలు దాచి పెట్టి ఉండవచ్చని భావిస్తున్నారు. ఈ నాణేలపై 474 ఏడీ నాటి చక్రవర్తులు హోనోరియాస్, వాలెంటినియమ్ III, లియోన్ I, ఆంటోనియో, లిబియో సెవెరోల గురించి రాసివున్నట్లు పురావస్తు పరిశోధకులు తెలియజేస్తున్నారు.