వచ్చే ఐదేళ్లలో 30 లక్షల ఉద్యోగాలు: లోకేష్‌

ఏపీలో అనేక సంస్థలు పెట్టుబడులు పెడుతున్నాయని.. భవిష్యత్తులో మరిన్ని కంపెనీలు ముందుకొస్తాయని మంత్రి లోకేష్‌ ఆనందం వ్యక్తం చేశారు. అవగాహన ఒప్పందాల ద్వారా ఉద్యోగాలు రావని విపక్షాలు అర్థ రహిత ఆరోపణలు చేస్తున్నాయని మండిపడ్డారు. ఎవరు ఎన్ని విమర్శలు చేసినా.. రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో పరిశ్రమలు వచ్చేట్టు చేయడమే తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు లోకేష్‌..

కేవలం ఐటీ రంగంలోనే మూడున్నర ఏళ్లలో 45 వేల ఉద్యోగాలు కల్పించామని మంత్రి లోకేష్‌ ప్రకటించారు. వచ్చే ఐదేళ్లలో 30 లక్షల ఉద్యోగాలు కల్పన చేస్తామని హామీ ఇచ్చారు. రాష్ట్రంలో నిరుద్యోగ యువతను ఆదుకునేందుకు యువనేస్తం ప్రారంభిస్తున్నామని ఆరోపించారు. కేవలం డబ్బులు ఇచ్చి చేతులు దులుపుకోకుండా.. వారికి శిక్షణ కూడా ఇస్తున్నామని వివరణ ఇచ్చారు..