భార్య అక్రమ సంబంధం.. తల నరికి..

husbend murder wife

ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఇద్దరు పిల్లలు కూడా పుట్టారు. భర్త స్నేహితుడితోనే పరిచయం. అది కాస్తా అక్రమ సంబంధానికి దారి తీసింది. ఫలితం ఒకరి ప్రాణాలను బలితీసుకుంది. బెంగళూరు చిక్కమంగళూరు జిల్లాకు చెందిన సతీష్ డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. 9 ఏళ్ల క్రితం రూప అనే అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. వారికి ఇద్దరు పిల్లలు పుట్టారు. డ్రైవర్‌గా పని చేస్తుంటే వచ్చే జీతం సరిపోవట్లేదని కుటుంబ జీవనం కష్టంగా ఉందని అజ్జంపురలో మాంసం దుకాణాన్ని ఓపెన్ చేశాడు. అదే ప్రాంతానికి చెందిన సునీల్ అనే వ్యక్తి పరిచయమయ్యాడు సతీష్‌కి.

రోజూ దుకాణానికి వస్తూ పోతుండేవాడు. సతీష్ భార్య రూప కూడా మాంసం దుకాణంలో ఉండేది. ఈ క్రమంలోనే సునీల్ రూపతో పరిచయం పెంచుకున్నాడు. వీరిద్దరి వ్యవహారం పట్ల సతీష్‌కి అనుమానం వచ్చింది. దీంతో కుటుంబంలో గొడవలు వచ్చాయి. వ్యవహారం పోలీస్ స్టేషన్ వరకూ వెళ్లింది. స్థానికులు కూడా కల్పించుకుని రాజీ ప్రయత్నం చేశారు. అయినా రూప, సునీల్‌ల వ్యవహారంలో మార్పు లేదు. సతీష్ పట్టరాని ఆగ్రహానికి గురయ్యాడు. కోపంతో ఉన్న సతీష్ సునీల్‌ని చంపాలని నిర్ణయించుకున్నాడు. కొడవలిని తీసుకుని అతడిపైకి విసిరాడు. కానీ సునీల్ తప్పించుకుని పారిపోవడంతో అక్కడే ఉన్న భార్య రూపపై దాడి చేసి తలను నరికేశాడు సతీష్. అంతటితో ఆగక ఆగ్రహంతో ఆ తలను తీసుకుని అజ్జంపుర పోలీస్ స్టేషన్‌కు వెళ్లి పోలీసుల ఎదుట లొంగిపోయాడు. కోపంతో ఉన్న సతీష్.. సునీల్‌కు రూ.3 లక్షలు అప్పు చేసి ఇచ్చానని, నమ్మించి మోసం చేయడమే కాకుండా పచ్చని సంసారంలో నిప్పులు పోశాడని నాభార్యను నాక్కాకుండా చేశాడని రోదిస్తున్నాడు. శిక్ష పూర్తయిన తరువాత బయటకు వచ్చి సునీల్‌ను హతమారుస్తానని సవాల్ చేస్తున్నాడు. పోలీసులు సతీష్‌ని హత్యా నేరం కింద కోర్టుకు హాజరు పరిచారు.