ఊపిరాడకపోవడమే ఇంతమంది మృతికి కారణం.. కొండగట్టు ఘటన

కొండగట్టు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో దాదాపుగా 50 మంది వరకు మరణించినట్లు తెలుస్తోంది. బస్సు ఘాట్‌రోడ్‌లో ప్రయాణిస్తూ అదుపు తప్పి లోయలో బోల్తా పడింది. పరిమితికి మించి ప్రయాణిస్తుండడం, ఘాట్ రోడ్ కావడంతో ప్రమాదానికి గురైనట్లు తెలుస్తోంది. బస్సు లోయలో పడినప్పుడు ఒకరి పై ఒకరు పడడంతో ఉక్కిరిబిక్కిరి అయి ఊపిరి ఆడక ఎక్కువ మంది చనిపోయి ఉండవచ్చని పోలీసులు చెబుతున్నారు. ఘటనా స్థలంలోనే 15-20 మంది వరకు చనిపోగా మరికొందరు ఆస్పత్రిలో ప్రాణాలు కోల్పోయారు. క్షతగాత్రుల్లో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రమాదం జరిగిన వెంటనే జిల్లా కలెక్టర్ శరత్,ఎస్పీ సింధూ శర్మ హుటాహుటిన అక్కడికి చేరుకుని సహాయ చర్యలను పర్యవేక్షిస్తున్నారు.