కొండగట్టు బస్సు ప్రమాదం విచారకరం- కేటీఆర్‌

కొండ గట్టు ఘాట్‌రోడ్డుపై బస్సు ప్రమాదం దురదృష్టకరమని ఆపద్ధర్మ మంత్రి కేటీఆర్‌ అన్నారు. ఈ ప్రమాదంలో యాభై మందికి పైగా మృతిచెందడం కలిచి వేసిందన్నారు. ఎంపీ కవిత, మరో ఆపద్ధర్మ మంత్రి మహేందర్‌రెడ్డితో కలిసి జగిత్యాల ప్రభుత్వాస్పత్రిలో క్షతగాత్రులను ఆయన పరామర్శించారు. మృతుల కుటుంబాలను ఓదార్చారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం నుంచి ఐదు లక్షలు, ఆర్టీసీ తరపున మూడు లక్షల నష్టపరిహారం అందజేస్తామని చెప్పారు. ఇలాంటి ఘటనల పునరావృతం కాకుండా కఠినచర్యలు తీసుకుంటామని మహేందర్‌రెడ్డి చెప్పారు.