వివాహేతర సంబంధానికి చిన్నారి అడ్డు అని తల్లి చేసిన పని చూస్తే..

mother-harassments-child-hyderabad

వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉందన్న కారణంగా మూడేళ్ళ చిన్నారిని ప్రియుడితో కలిసి చిత్ర హింసలకు గురిచేసిందో తల్లి. ఈ ఘటన హైదరాబాద్ మలక్ పాటలో జరిగింది. యాదాద్రి జిల్లా, పాలడుగు గ్రామానికి చెందిన ముక్కాముల వెంకన్న, సరిత దంపతులకు రేణుక(3) కుమార్తె ఉంది. కొంతకాలం కిందట వెంకన్నకు మరో మహిళతో వివాహేతర సంబంధం ఉందని తెలుసుకున్న సరిత భర్తతో గొడవపడుతోంది. ఈ క్రమంలో భార్యభర్తల మధ్య మనస్పర్థలు రావడంతో ఇటీవల వారు విడివిడిగా ఉంటున్నారు. సరిత ప్రశాంత్‌నగర్‌లో ఉంటూ ఇళ్లల్లో పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తోంది. ఈ క్రమంలో ఆమెకు మిర్యాలగూడకు చెందిన డీసీఎం డ్రైవర్‌ వెంకట్‌రెడ్డితో పరిచయం ఏర్పడింది. వారి పరిచయం కొద్ది రోజులకే వివాహేతర సంబంధానికి దారితీసింది. దాంతో ఇద్దరు కలిసి ఒకే ఇంట్లో ఉంటున్నారు. అయితే తమ సంబంధానికి అడ్డుగా వస్తుందన్న కారణంగా కూతురు రేణుకను సరిత, తన ప్రియుడితో కలిసి చిత్ర హింసలకు గురిచేసేది. దీంతో ఆ పాప ఆర్తనాదాలు విన్న స్థానికులు చైల్డ్‌ వెల్ఫేర్‌ కమిటీకి సమాచారం అందించారు. సోమవారం వారు పాపను తీసుకుని శిశువిహార్‌కు తరలించారు. అనంతరం వారిపై కేసు నమోదు చేసి సరితను అదుపులోకి తీసుకున్నారు. పరారీలో ఉన్న వెంకటరెడ్డి కోసం పోలీసులు గాలిస్తున్నారు.