కాంగ్రెస్, టీడీపీలో ఆసక్తికరంగా మారిన ఆ నియోజకవర్గం..

madhira political update

వరంగల్‌ జిల్లాలో అన్ని పార్టీల్లోనూ టికెట్ల లొల్లి ముదిరినట్టే కనిపిస్తోంది. 5 నియోజకవర్గాల్లో టీఆర్ఎస్ అభ్యర్థులపై తీవ్ర అసమ్మతి ఉంది. భూపాల్‌పల్లి, జనగామ, పాలకుర్తి, మహబూబాబాద్, స్టేషన్ ఘన్‌పూర్‌లో అభ్యర్థులను మార్చాలంటూ డిమాండ్లు తెరపైకి వచ్చాయి. అటు, కాంగ్రెస్-టీడీపీ పొత్తుపై చర్చలు జరుగుతున్న నేపథ్యంలో.. జిల్లాలో ఏ టికెట్ ఎవరికి కేటాయిస్తారన్న దానిపైనా ఉత్కంఠ నెలకొంది. టీడీపీ సీనియర్ నేత రేవూరి నర్సంపేట నుంచి పోటీకి సిద్ధమయ్యారు. ఐతే.. అదే స్థానం నుంచి తాజా మాజీ ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి కూడా పోటీ చేస్తానంటున్నారు. రెండు పార్టీల మధ్య పొత్తు నేపథ్యంలో ఎలాంటి నిర్ణయం ఉంటుదంన్నది ఆసక్తికరంగా మారింది. అటు, వరంగల్ ఈస్ట్ అభ్యర్థి విషయంలోనూ ఏ పార్టీలోనూ స్పష్టత లేదు. కొండా సురేఖ కాంగ్రెస్‌లో చేరడంపై ఒకట్రెండు రోజుల్లో స్పష్టత వచ్చే అవకాశం ఉంది.