పెట్రోల్‌ బంక్‌‌లో పేలుడు.. 35మంది మృతి

నైజీరియాలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. గ్యాస్‌ ట్యాంకర్‌ పేలిపోవడంతో దాదాపు 35 మంది ప్రాణాలు కోల్పోగా, 100 మందికి పైగా క్షతగ్రాతులయ్యారు.ఓ పెట్రోల్ బంక్‌ వద్ద ప్రమాదవశాత్తూ గ్యాస్‌ ట్యాంకర్‌ పేలి మంటలు చెలరేగడంతో ఈ ప్రమాదం సంభవించింది. అబుజాలోని లఫియా, మాకుర్ది మార్గంలో ఉన్న ఓ పెట్రోల్ బంక్‌ వద్ద ప్రమాదవశాత్తూ గ్యాస్‌ ట్యాంకర్‌లో మంటలు చేలరేగాయి. దీంతోరోడ్డుపై వెళుతున్న వాహనాల్లో ఉన్న వ్యక్తులకు మంటలకు అంటుకున్నాయి. ఈ ప్రమాదంలో 35 మంది ప్రాణాలు కోల్పోగా 100 మందికి తీవ్రగాలయ్యాయి. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.