నేను గెలవాలంటే.. నువ్వు ఓడాలి.. రేసింగ్‌లో బ్రేక్ నొక్కబోయి.. వీడియో

విజయం వరించాలంటే పక్కవాడిని తొక్కేయవలసిన అవసరం లేదు. మరికొంత ప్రయత్నించాలి. అన్యాయంగా గెలవాలనుకుంటే అడ్డంగా బుక్కవుతారు. అయినా అలాంటి విజయం ఆనందాన్ని కూడా ఇవ్వదు. బైక్ రైసింగ్‌లో రైడర్ చేసిన తప్పిందానికి జీవితకాలం నిషేధానికి గురయ్యాడు ప్రత్యర్థి రైడర్. లండన్‌లో నిర్వహించిన బైక్ రైసింగ్ ఉత్కంఠంగా సాగుతోంది. ఇటాలియన్ మోటో జిపీ-2కు చెందిన రొమానే పెనటీ.. జాన్ మెరీనో జీపీ రైడ్ సందర్భంలో ప్రత్యర్థి స్టెఫాన్ మంజీ బైక్ బ్రేక్‌ను లాగి అతడిని
పడేయాలని ప్రయత్నించాడు.

అసలే 220 కిలో మీటర్ల వేగంతో వెళుతోన్న మంజీ బైక్ తృటిలో ప్రమాదాన్ని తప్పించుకుంది. కొద్దిగా పట్టుతప్పినా క్షణాల్లో ప్రాణాలు గాల్లో కలిసిపోయేవి. ఈ వ్యవహారంతో ఫెనాటీ జీవితకాలం రేసింగ్ గేమ్ ఆడకుండా నిషేధానికి గురయ్యాడు. రేసింగ్ నిర్వాహకులు అతడిపై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసారు. తాను చేసిన తప్పు తెలుసుకున్న ఫెనాటీ క్షమాపణలు కోరాడు. తాను చేసిన తప్పిదం ఎంతటి ప్రమాదకరమైందో తెలుసుకుని విచారించాడు. అభిమానులను క్షమించమని వేడుకున్నాడు.