ఇక్కడ చీకటి పడిందంటే చాలు.. వ్యభిచారం : మానేది లేదని తేల్చి చెబుతున్న మహిళ

sex rocket busted in rgi airport

ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్ట్‌తో ప్రపంచ పటంలో ప్రత్యేకస్థానం సంపాదించుకున్న శంషాబాద్‌ ప్రాంతం.. వ్యభిచార ముఠాలకు అడ్డాగా మారింది. చీకటి పడిందంటే చాలు ఇక్కడ గలీజ్‌ దందా జోరుగా సాగుతోంది. ప్రభుత్వ కార్యాలయాల సమీపంలో.. పోలీస్టేషన్‌కు కూతవేటు దూరంలో కార్యకలాపాలు కొనసాగుతున్నప్పటికీ పట్టించుకునే నాథుడే కరువయ్యాడు. ఖాకీలు మాకెందుకులే అన్నట్టుగా వ్యవహరిస్తుండడంతో వీరి దందా యథేచ్ఛగా సాగిపోతోంది. ఇక్కడ జరుగుతున్న చీకటి బాగోతాన్ని టీవీ5 బట్టబయలు చేసింది. నెలల తరబడిగా సాగుతున్న దందాను వెలుగులోకి తెచ్చింది. నిత్యం వ్యభిచారం నిర్వహిస్తున్న ముఠాలు… తమ అడ్డాలో టీవీ5 ప్రతినిధులను చూసి షాకయ్యారు. కొంతమంది విటులు కెమెరాలకు చిక్కకుండా పరుగులు తీశారు.

మొదట టీవీ5 ప్రతినిధులను చూసి పరారైన విటుడు.. కొద్దిసేపటికే మళ్లీ యధావిధిగా తమ బుద్ధి చూపించాడు. వెనక్కి తిరిగొచ్చి ఎలాంటి జంకు లేకుండా మరోసారి మహిళతో బేరం కుదుర్చుకున్నాడు. ఈ వ్యవహారాన్ని కెమెరాలో బంధించడంతో.. మరోసారి అక్కడ్నుంచి పరుగులు తీశాడు. వ్యభిచారం నిర్వహిస్తున్న మహిళ సైతం.. కెమెరాను చూసి ముఖం చాటేసింది. ఇక.. వ్యభిచారం నిర్వహిస్తూ టీవీ5 ప్రతినిధులకు పట్టుబడ్డ మహిళ.. తాను చేస్తున్న పనిని నిస్సిగ్గుగా సమర్థించుకుంది. ఎన్నిసార్లు జైలుకు పంపించినా.. ఈ పని మానేది లేదంటూ తేల్చి చెప్పింది.

ఎయిర్‌పోర్ట్‌ ఏర్పాటయ్యాక ఇతర రాష్ట్రాల నుంచి వలస వచ్చి శంషాబాద్‌లో స్థిరపడే వారి సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. అంతేవేగంగా అసాంఘిక కార్యకలాపాలు పెరిగిపోయాయి. ఈజీమనీ కోసం శంషాబాద్‌ను అడ్డాగా చేసుకుని వ్యభిచార దందా సాగిస్తున్నారు. మండల కార్యాలయాల సమీపంలోనే తిష్ట వేస్తున్న ముఠాలు.. రాత్రి తొమ్మిది దాటిందంటే చాలు దర్జాగా బేరసారాలు సాగిస్తున్నాయి. వ్యాపార సముదాయాలు మూతపడ్డ చోటును కామకేళికి అడ్డాలుగా మార్చుకుంటున్నాయి. దీంతో.. వ్యాపారులు తమ షాపుల ముందు కుప్పలుగా కనిపిస్తున్న కండోమ్‌లను చూసి నెత్తీ నోరూ బాదుకుంటున్నారు.

మరోవైపు శంషాబాద్‌లో గలీజ్‌ దందాపై టీవీ5 కథనాలు ప్రసారం చేయడంతో.. ఆర్‌జీఐఏ పోలీసులు స్పందించారు. నిన్న రాత్రి వ్యభిచార అడ్డాలపై దాడులు నిర్వహించారు. పోలీసుల రాకను పసిగట్టిన వ్యభిచార ముఠాలు, విటులు అక్కడ్నుంచి పారిపోయారు. అక్కడే చెట్ల పొదల్లో దాక్కున్న కొంతమందిని పట్టుకున్న పోలీసులు.. వ్యభిచారం నిర్వహిస్తే తాట తీస్తామంటూ హెచ్చరించారు. మరోసారి ఈ ప్రాంతంలో కనిపించొద్దంటూ వార్నింగ్‌ ఇచ్చి వదిలేశారు. శంషాబాద్‌ ప్రాంతంలో వ్యభిచార ముఠాలకు శాశ్వతంగా చెక్‌ పెట్టాలని స్థానికులు పోలీసులను కోరుతున్నారు. నిత్య రాత్రిపూట పెట్రోలింగ్‌ నిర్వహించాలంటున్నారు.