పాము, వడ్రంగి పిట్ట ఇంటి పోరు.. వెనక్కి తగ్గేది లేదంటూ రెండూ.. వీడియో

గూడు కట్టుకోవడానికి ఓ చెట్టుని చూసింది వండ్రంగి పిట్ట. చుట్టూ ఎన్ని చెట్లున్నా ఓ చెట్టు మాత్రం దానికి నచ్చింది. అక్కడే గూడుని నిర్మించుకోవాలనుకుంది. పగలు రాత్రి కష్టపడుతూ పొడవైన ముక్కుతో చెట్టు బెరడుని తొలగించింది. గూటిని ఏర్పాటు చేసింది. ఆహారం కోసం బయటకు వెళ్లిన సమయంలో తాను నిర్మించిన గూటిలోకి ఓ పాము వచ్చి చేరింది.

ఇది నాది అంటూ దానితో వాగ్యుద్ధానికి దిగింది. వండ్రంగి పిట్ట కూడా ఏ మాత్రం తగ్గేది లేదంటూ హోరాహోరీకి సిద్దమైంది. ఈ గూడు ఎన్నో రోజుల కష్టం. ఇప్పుడొచ్చి నాది అంటే నేనెందుకు ఒప్పుకుంటాను అని శక్తికి మించి పాముతో పోరాడింది పిట్ట. గూటిలో ఉన్న గుడ్లను పాము తినేస్తుందన్న బాధ మరింత ధైర్యాన్ని తెచ్చింది వడ్రంగి పిట్టకు. కానీ పాము.. పిట్టను అస్సలు పడనివ్వలేదు.

ఇది నా ఇల్లు అంటూ పిట్ట కట్టుకున్న గూటిని ఆక్రమించడమే కాకుండా అధారిటీ కూడా చేసింది. పాము పోరాటానికి పిట్ట అలసి పోయింది. మళ్లీ మళ్లీ ప్రయత్నించినా పాముని గూటిలో నుంచి తరిమి కొట్టలేకపోయింది. తన బిడ్డలు పాముకి ఆహారం అయిపోతున్నాయని మూగగా రోదించింది. మళ్లీ పిట్ట జన్మ వద్దని మనసులోనే దేవుడిని కోరుకుంది.