సంచలన నిర్ణయం తీసుకున్న ఫైట్ మాస్టర్స్ రామ్ ల‌క్ష్మణ్‌.. ఇంటికి వెళ్ళిపోతున్నాం..

stunt-choreographers-says-good-bye-to-film-industry

సినీ పరిశ్రమలో ఉండే ఫైట్ మాస్టర్లలో రామ్ లక్ష్మణ్ బ్రదర్స్ కూడా ఒకరు. ఒకటే మాట, ఒకటే ఆలోచన, ఒకే డ్రెస్.. ఇది వారి ప్రత్యేకత. ఫైట్ మాస్టర్స్ గా వందల సినిమాలకు పనిచేశారు. టాప్ స్టార్స్ అందరికీ డూప్ గా నటించారు .తాజాగా మరికొద్ది రోజుల్లో వారు సినిమాలకు గుడ్ బై చెప్పనున్నారు. ఈ విషయాన్నీ స్వయంగా రామ్ లక్ష్మణ్ బ్రదర్స్ వెల్లడించారు. సినిమాల్లో పడి చాలా ఏళ్లుగా తమ గ్రామానికి దూరమయ్యామని.. దాంతో త్వరలోనే సినిమాలు మానేసి ప‌ల్లెటూరి వాతావ‌ర‌ణంలో జీవ‌నం సాగించాల‌ని తాము కోరుకుంటున్న‌ట్టు చెప్పారు. అలాగే తాము పుట్టి పెరిగిన గ్రామంలో సేవా కార్య‌క్ర‌మాలు చేయాల‌ని తాము భావిస్తున్న‌ట్టు పేర్కొన్నారు.