జగ్గారెడ్డి దేశద్రోహానికి పాల్పడ్డారు- పద్మాదేవేందర్‌రెడ్డి

మహిళలను విదేశాలకు అక్రమ రవాణా చేస్తూ దేశద్రోహానికి పాల్పడిన జగ్గారెడ్డిని.. కాంగ్రెస్‌ నేతలు సపోర్ట్‌ చేయడం శోచనీయమని మాజీ డిప్యూటీ స్పీకర్‌ పద్మాదేవేందర్‌ రెడ్డి విమర్శించారు. సైనికుడిగా దేశరక్షణకు పాటుపడ్డానని చెప్పుకునే పీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి.. దేశద్రోహానికి పాల్పడ్డ జగ్గారెడ్డిని వెనుకోసుకొచ్చినందుకు తక్షణమే మహిళాలోకానికి క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. మాజీ మంత్రి సునీతాలక్ష్మారెడ్డి ఒక మహిళ అయ్యుండి.. మహిళలను అక్రమ రవాణా చేస్తున్న జగ్గారెడ్డిని సపోర్ట్‌ చేయడం దారుణమన్నారు. దేశద్రోహి జగ్గారెడ్డి కోసం కాంగ్రెస్‌ పార్టీ బంద్‌కు పిలుపునివ్వడమేమిటని పద్మా దేవేందర్‌రెడ్డి ప్రశ్నించారు.