నేడు పార్టీ నేతలతో జగన్ కీలక సమావేశం

today ycp meeting in vishaka

2019 ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ వ్యూహాలకు పదును పెడుతోంది. ప్రజా జంకల్ప యాత్రతో నిత్యం జనంలోనే ఉంటున్న జగన్‌.. వారి సమస్యలు తెలుసుకుంటున్నారు. అధికారంలోకి వచ్చాక అందరికీ న్యాయం చేస్తానంటూ భరోసా ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. అలాగే ప్రజల్లో ప్రభుత్వంపై వ్యతిరేకత పెంచేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. అలాగే పార్టీ నేతలను కూడా ఎన్నికలకు సిద్ధం చేస్తున్నారు.

ప్రస్తుతం విశాఖలో ప్రజా సంకల్ప యాత్ర చేస్తున్న జగన్‌.. నేడు పార్టీ నేతలతో కీలక సమావేశం నిర్వహించనున్నారు. 175 అసెంబ్లీ, 25 పార్లమెంట్‌ నియోజకవర్గాల సమన్వయకర్తలు ఈ సమావేశానికి హాజరు కానున్నారు. ఇటీవలి కాలంలో ఇంత భారీ స్థాయిలో జరుగుతున్న సమావేశం ఇదే కావడంతో రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది.

ఈ భేటీలో కీలక నిర్ణయాలు వెలువడే అవకాశం కనిపిస్తోంది. 2019 ఎన్నికలే లక్ష్యంగా పార్టీ కేడర్‌కు జగన్‌ పలు సూచనలు చేయనున్నట్లు సమాచారం. అయితే, జగన్‌ అజెండా ఎలా ఉండబోతోందన్న దానిపై రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.