ఫ్లాట్‌లోకి చొరబడిన 10 అడుగుల కొండచిలువ

కొండచిలువలు తరుచుగా జనవాసాల్లోకి చొరబడి హల్‌చల్ చేస్తున్నాయి. తాజాగా హర్యానాలోని ఓ ఇంట్లోకి కొండచిలువ చొరబడి కలకలం సృష్టించింది. గురుగ్రామ్‌లోని ఫ్లాట్ నంబర్ డీఎల్‌ఎఫ్ 5లోకి కొండచిలువ ప్రవేశించింది.10 అడుగుల, 11 కిలోల బరువు ఉన్న కొండచిలువ ప్లాట్‌లోని కిచన్‌లోకి చొరబడి కుంటుంబ సభ్యులను పరుగులు పెట్టించింది. స్థానికులు సమాచారమందించడంతో అక్కడికి చేరుకున్న జంతుసంరక్షణ కార్యకర్త అనిల్ గండాస్ దానిని పట్టుకొని అటవి ప్రా్ంతంలో వదిలిపెట్టారు .దీంతో కుంటుంబ సభ్యులు ఒక్కసారిగా ఊపిరి పీల్చుకున్నారు