ట్రంప్ సెక్యూరిటీ వింగ్‌లో తొలి సిక్కు వ్యక్తి

ప్రపంచ అధినేతల్లో అత్యంత కట్టుదిట్టమైన భద్రత వ్యవస్థ కలిగిన వ్యక్తి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. తాజాగా అతని సెక్యూరిటీ టీమ్‌లో తొలి సిక్కు వ్యక్తి అన్ష్‌దీప్ సింగ్ భాటియా చోటు సంపాదించాడు. 1984 సిక్కుల ఊచకోత సమయంలో అన్ష్‌దీప్ కుటుంబం కాన్పూర్ నుంచి పంజాబ్‌లోని లుధియానాకు వలస వచ్చింది 2000వ సంవత్సరంలో ఇండియా నుంచి వలస వెళ్ళిన భాటియా కుంటుంబం అక్కడే ప్దిరపడింది. అధ్యక్షుడి సెక్యూరిటీ టీమ్‌లో ఉండాలన్నదే తన లక్ష్యంగా పెట్టుకున్న అన్ష్‌దీప్. దానికి తగ్గట్టుగా శ్రమించి అనుకున్నది సాధించాడు. కఠినమైన శిక్షణ అనంతరం అతన్ని ట్రంప్ సెక్యూరిటీ వింగ్‌లో నియమించారు.