అను ఆశలన్నీ అల్లుడు మీదే..

ఇష్టంగా ఇండస్ట్రీకి వచ్చింది. మంచి అవకాశాలే సొంతం చేసుకుంది. కెరీర్ మొదట్లోనే పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్‌తో నటించే ఛాన్స్ కూడా కొట్టేసింది. కానీ ఎందుకో అన్ని సినిమాలు బెడిసి కొట్టాయి. అను ఉంటే ఆ సినిమా ఫట్టే అన్న ఇమేజ్‌ని క్యారీ చేస్తూనే మరో సినిమాలో అవకాశం వస్తే ఎగిరి గంతేసింది. ఇదైనా హిట్ అవ్వాలి దేవుడా అంటూ మొక్కుకుంటోంది కనిపించిన దేవుళ్లందరికీ అనూ ఇమ్మాన్యుయేల్.

శైలజా రెడ్డి అల్లుడితో తన అదృష్టాన్ని పరీక్షించుకుంటోంది. కొంతమంది దర్శక నిర్మాతలు అనూకి దూరంగా ఉన్నా మారుతి మాత్రం ధైర్యం చేసి ఆమెను తీసుకున్నారు. ఇది హిట్టయితే మరి కొన్ని అవకాశాలు తలుపు తడతాయి. లేదంటే తట్టా బుట్టా సర్థుకోవలసి వస్తుందేమో. ఏదేమైనా ఈ ఒక్క రోజు ఆగితే అత్తా, అల్లుడి మజాకా ఏంటో తెలిసిపోతుంది. సెప్టెంబర్ 13న ప్రేక్షకుల ముందుకు రానుంది శైలజా రెడ్డి అల్లుడు. ఈ చిత్రం కోసం అక్కినేని అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.