బిగ్‌బాస్ హౌస్‌ నుంచి కౌశల్ ఎలిమినేట్..?

హౌస్‌లో ఎంత మంది ఉన్నా మొదట్నుంచీ అందరి ఫోకస్ కౌశల్ మీదే ఉంది. ఇందుకు అతడికున్న ఫ్యాన్ ఫాలోయింగే కారణం. కౌశల్ ఆర్మీ అంటూ ఏకంగా ఒక గ్రూప్ కూడా క్రియేట్ చేశారు అభిమానులు. మొన్నటికి మొన్న అతడి విజయాన్ని కోరుతూ 2కే రన్ కూడా నిర్వహించారు. అయితే హౌస్‌లో దీనికి పూర్తి విరుద్ధంగా జరగనున్నట్లు సమాచారం. హౌస్‌ నుంచి కౌశల్‌ని బయటకు పంపించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నట్లు తెలుస్తోంది. షో ముగింపు దశకు చేరుకోవడంతో ఓ ఆసక్తికర గేమ్‌ని బిగ్‌బాస్ కౌశల్ కోసం క్రియేట్ చేసారట. దానిపేరే రూలర్ గేమ్.

ఈ గేమ్‌లో బిగ్‌బాస్ హౌస్‌ని రాజ్యంగా మార్చి కంటెస్టంట్లని ప్రజలుగా, కౌశల్‌ని రాజుగా ప్రకటించనుందట. ప్రజలంతా రాజు ఆజ్ఞలు శిరసావహించాల్సి ఉంటుంది. రాజుకి ఎదురు తిరిగితే కఠిన శిక్షలు కూడా విధించే అధికారం అతడికి ఉంటుంది. ఈ టాస్క్ ద్వారా కౌశల్‌ ఎలిమినేట్ అన్నా అవ్వచ్చు లేదంటే అతడికి ఉన్న ఫాన్ ఫాలోయింగ్‌నైనా తగ్గించొచ్చు అనేది బిగ్‌బాస్ ఆలోచన. ఇలాంటి గేమ్ హిందీలో, తమిళ్‌లో, మరాఠీలో బాగా వర్కవుట్ అయింది. రాజుపై వ్యతిరేకత, ప్రజలపై సానుభూతి వ్యక్తమైంది. మరి తెలుగు ప్రేక్షకులు, ముఖ్యంగా కౌశల్ ఆర్మీ ఎలా తీసుకుంటారో చూడాలి.