కొండగట్టు ప్రమాదం.. ఐస్ గడ్డల్లో పెట్టి పైన ఊక కప్పిన మృతదేహాలు

bus accident

కొండగట్టు ప్రమాదంతో మృతుల కుటుంబాల్లో అంతులేని విషాదం నెలకొన్నా.. వాళ్ల బాధ ప్రభుత్వ అధికారులను ఏమాత్రం కదిలించలేకపోతోంది. మృతదేహాల్ని భద్రపరిచేందుకు కనీసం ఫ్రీజర్‌‌బాక్స్‌లు కూడా సమకూర్చకపోవడం విమర్శలకు తావిస్తోంది. శనివారపేటలో 3 మృతదేహాలను ఇలా మంచుగడ్డల్లో కప్పి ఉంచారు బంధువులు. దుబాయ్‌లో ఉన్న కుటుంబ సభ్యులు వచ్చాకే అంత్యక్రియలు చేయాల్సి ఉన్నందున.. అప్పటి వరకూ డెడ్‌బాడీల్ని ఇలా ఐస్ గడ్డల్లో పెట్టి పైన ఊక కప్పి ఉంచారు. ఈ దారుణమైన పరిస్థితి చూసేవాళ్ల హృదయాలను తీవ్రంగా కలిచి వేస్తోంది.