ముగిసిన కేంద్ర ఎన్నికల సంఘం బృందం పర్యటన

తెలంగాణ‌లో ఎన్నిక‌ల నిర్వహ‌ణ‌పై కేంద్ర ఎన్నిక‌ల ప్ర‌తినిది బృందం ప‌ర్య‌ట‌న ముగిసింది. రెండు రోజుల పాటు హైద‌రాబాద్ లో ప‌ర్య‌టించిన ఎన్నిక‌ల అదికారులు రాజ‌కీయ పార్టీలు.. ప్ర‌భుత్వ అదికారులతో స‌మావేశాలు నిర్వ‌హించింది. ఎన్నిక‌ల స‌న్నాహ‌కాలపై వివ‌రాలు అడిగి తెలుసుకున్నారు. రాజ‌కీయ పార్టీల‌తో స‌మావేశం మాత్రం హాట్ హాట్ గా సాగింది .. ఎన్నిక‌ల్లొ అదికారులు తీసుకోవాల్సిన జాగ్ర‌త్త‌ల‌పై పూర్తి స్థాయిలో చ‌ర్చించింది ఎన్నిక‌ల క‌మిష‌న్ బృదం. పూర్తిస్థాయి నివేద‌క కేంద్ర ఎన్నిక‌ల క‌మిష‌న్ కు అంద‌జేస్తామ‌ని ఎన్నిక‌లు ఎప్పుడు నిర్వ‌హించాల‌న్నా దానిపై సీఈసీ నిర్ణ‌యం తీసుకుంటుంద‌ని తెలిపింది.

తెలంగాణ శాసన స‌భ‌ర‌ద్దు నేప‌థ్యంలో రాష్ట్రంలో ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ ప‌రిస్థితుల‌పై అధ్య‌య‌నానికి ఉద‌య్ సిన్హా నేతృత్వంలోని ఎన్నిక‌ల అదికారుల బృదం హైద‌రాబాద్ లో ప‌ర్యటించింది. రెండు రోజుల ప‌ర్య‌ట‌న‌ల‌లో తెలంగాణ‌లోని రాజ‌కీయ పార్టీల‌తో స‌మావేశం నిర్వ‌హించింది. ఈ స‌మావేశంలో తెలంగాణ‌లోని జాతీయ పార్టీల‌తో పాటు ప్రాంతీయ పార్టీల అభిప్రాయాల‌ను సేక‌రించింది . పార్టీలు ప్ర‌దానంగా ఓట్ల గ‌ల్లంతు.. కొత్త ఓట‌ర్ల న‌మోదుకు ఎన్నిక‌ల క‌మిష‌న్ ఇచ్చిన గ‌డువుపై తీవ్ర అభ్యంత‌రాలు వ్య‌క్తం చేసాయి. ఓట‌ర్ల జాబితాల స‌వ‌ర‌ణ … కొత్త ఓట్ల న‌మోదు లేకుండా ఎన్నిక‌లు నిర్వ‌హించేందుకు తొంద‌ర ఏంటంటూ ప్ర‌శ్నించాయి. ఇక మ‌రోవైపు ఖ‌మ్మం జిల్లాల్లో ఆంధ్ర‌లో క‌లిపిన ఏడుమండ‌లాల‌పై నిర్ణ‌యం తీసుకోకుండా ఎన్నిక‌ల‌కు ఎలా వెళ్తారంటూ ఆగ్ర‌హం వ్య‌క్తం చేసాయి. ఓట్ల గ‌ల్లంతు పై పూర్తిస్థాయి విచార‌ణ చేప‌ట్టాల‌ని .. ఇక ఇంటి అడ్ర‌స్ ల‌ను కూడా త‌ప్పుల త‌డ‌క‌గా న‌మోదు చేసుకున్నార‌ని.. ఎక్క‌డ ఓట్లు వేయాలో తెలియ‌క ఓట‌ర్లు పోలింగ్ బూత్ కు వ‌చ్చి వెనుదిర‌గాల్సిన ప‌రిస్థితి వ‌స్తుంద‌ని రాజ‌కీయ పార్టీలు అస‌హ‌నం వ్య‌క్తం చేసాయి. ఇక ఎన్నిక‌ల క‌మిష‌న్ ఓటర్ల నమోదు గ‌డువును మ‌రికొంత కాలం పొడ‌గించాల‌ని కేంద్ర ఎన్నిక‌ల బృందంనికి విజ్ఞ‌ప్తి చేసాయి. ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌కు అంత‌తొంద‌రేంట‌ని .. రాజ్యంగ బ‌ద్దంగా ఎన్నిక‌లు నిర్వ‌హించాల‌ని .. కేసీఆర్ ఆదేశాల ప్రకారం కాద‌ని ప్ర‌తిపక్షాలు డిమాండ్ చేసాయి. రాజ‌కీయ పార్టీలతో స‌మావేశం ముగిసిన త‌రువాత క్షేత్రాస్థాయి అదికారుల‌తో ఎన్నిక‌ల ఏర్పాట్ల‌పై రెండుగంట‌ల పాటు స‌మావేశం అయ్యారు.

రెండోరోజు కేంద్ర ఎన్నిక‌ల బృందం ప‌ర్య‌ట‌న‌లో భాగంగా జిల్లాస్థాయి అదికారుల‌తో స‌మావేశం నిర్వ‌హించారు. ఈ స‌మావేశంలో 31 జిల్లాల క‌లెక్ట‌ర్లు .. ఐజీలు… ఎస్పీలు పాల్గొన్నారు. వీరితో సుమారు ఆరుగంట‌ల పాటు సుదీర్ఘంగా స‌మావేశం అయ్యారు. ఈ స‌మావేశంలో ప్ర‌ధానంగా ఎన్నిక‌ల‌కు సంబందించి ఏర్పాట్ల‌పై చ‌ర్చించారు. మ‌రోవైపు రాజ‌కీయ పార్టీలు లేవ‌నెత్తిన ఓటర్ లిస్టుల్లో పేర్ల గ‌ల్లంతు కొత్త ఓట‌ర్ల న‌మోదు అంశాల‌పై పూర్తిస్థాయిలో చ‌ర్చించారు. ఓట్ల గ‌ల్లంతు అయిన ప్రాంతాల్లో క్షేత్ర‌స్థాయి విచార‌న జ‌రిపి అర్హులు ఉంటే తిరిగి వారిని జాబితాలో చేర్చాల‌ని.. ఇక కొత్త ఓట‌ర్ల న‌మోదు పైనా ప్రత్యేక దృష్టి సారించాల‌ని కేంద్ర ఎన్నిక‌ల క‌మిష‌న్ బృందం వీరికి సూచించింది. రాష్ట్రంలో స‌మ‌స్యాత్మ‌క ప్రాంతాల్లో శాంతి బ‌ద్ర‌తల‌పైనా పూర్తిస్తాయి స‌మాచారం సేక‌రించిన‌ట్లు కేంద్ర బృందం తెలిపింది. ఆయా ప్రాంతాల్లో తీసుకోవాల్సిన జాగ్ర‌త్త‌ల‌పైనా ప‌లు సూచ‌న‌లు చేసింది. ఈవీఎంల బ‌ద్ర‌త , స్టోరేజ్ పాయింట్లు, ర‌వాణ స‌దుపాయాల‌పైనా వివ‌రాలు అడిగి తెలుసుకున్నారు. ఓట‌ర్ల‌ను ప్ర‌లోబ పెట్టే అంశాల‌పైనా ప్ర‌త్యేక దృష్టి పెట్టాల‌ని అదికారుల‌కు సూచించిన‌ట్టు సీనియ‌ర్ డిప్యూటి ఎన్నిక‌ల క‌మిష‌న‌ర్ ఉమేష్ సిన్హా. ఇక కొత్త‌గా ఓటున‌మోదు కోసం గ్రామీణ స్థాయిలో విస్త్రుతంగా ప్రచార కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించాల‌ని నిర్ణ‌యించిన‌ట్టు ఆయ‌న తెలిపారు. ఇక ఇందుకోసం ఎస్ఎంఎస్ అల‌ర్టులు పంప‌డం తో పాటు సోష‌ల్ మిడియాను కూడా విస్తృతంగా వినియోగించాల‌ని సూచించిన‌ట్టు ఆయ‌న తెలిపారు. ఓట‌ర్ల న‌మోదు.. స‌వ‌ర‌ణ‌ల‌కు ఇచ్చిన గ‌డువులో పండ‌గ‌లు వ‌స్తున్నాయ‌ని.. గ‌డువు మ‌రింత పొడ‌గించడంతో పాటు ఏడు మండ‌లాలా వ్య‌వ‌హారంపై కూడా రాజ‌కీయ పార్టీల అభ్య‌ర్ద‌న‌ను కేంద్ర ఎన్నిక‌ల క‌మిష‌న్ కు అంద‌జేస్తామ‌న్నారు. ఎన్నిక‌లు ఎప్పుడు నిర్వ‌హించేది కేంద్ర ఎన్నిక‌ల సంఘం నిర్ణ‌యిస్తుంద‌ని ఉమేష్ సిన్హా తెలిపారు.

కేంద్ర ఎన్నికల సంఘం ప్ర‌తినిదులు రెండ‌వ రోజు ప్ర‌భుత్వ ప్ర‌దాన కార్య‌ద‌ర్శి, డీజీపీ ల‌తో్ పాటు ప‌లు శాఖల‌ ముఖ్య‌కార్య‌ద‌ర్శుల‌తో స‌చివాల‌యంలో ప్ర‌త్యేకంగా స‌మావేశం అయ్యింది. ఈ సంద‌ర్భంగా ఎన్నిక‌ల‌కోసం రాష్ట్రంలో జ‌రుగుతున్న ఏర్పాట్ల‌పై చ‌ర్చించారు.