జూబ్లీహిల్స్‌ చెక్‌పోస్ట్‌ వద్ద నీటి సంపులో మృతదేహం

dead body

హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌ చెక్‌పోస్ట్‌ వద్ద ఉన్న నాగలక్ష్మి టెంపుల్‌ నీటి సంపులో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభించింది. టెంపుల్‌ వద్ద దుర్గంధం వెదజల్లుతుండడంతో మొదట ఎలుక చనిపోయిందని భావించిన స్థానికులు తీరా నీటి సంపులో వెతకగా మృతదేహం కనిపించింది. దీంతో..స్థానికులు పోలీసులకు సమాచారమందించారు. సంఘటన స్థలానికి చేకుకున్న పోలీసులు నీటి సంపులో నుంచి మృతదేహాన్ని బయటకు తీశారు. అయితే.. మృతుణ్ణి స్థానికులు గుర్తించారు. మృతుడు ఆంధ్ర దేశ్‌కు చెందిన వ్యక్తి అని తెలిపారు. రోజూ ఈ ప్రాంతంలో మృతుడు భిక్షాటన చేసుకుంటూ కనిపించేవాడని చెప్పారు. పోలీసులు మృతదేహాన్ని గాంధి మార్చురీకి తరలించారు.