ఇకనుంచి ఆ ఎన్నికలకు ‘నోటా’ లేదు : ఎన్నికల సంఘం

ec-removes-nota-option-rajya-sabha-legislative-council-polls

సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు రాజ్యసభ, శాసన మండలి ఎన్నికలకు సంబంధించిన బ్యాలెట్‌ పేపర్లలో నోటా(నన్‌ ఆఫ్‌ ది ఎబో) గుర్తును తొలగిస్తున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. ఈ ప్రకటనతో ఇకనుంచి రాజ్యసభ, శాసనమండలి ఎన్నికల బ్యాలెట్‌ ఆప్షన్లకు నోటా వర్తించదని ఈసీ స్పష్టంచేసింది. ఈ రెండింటినుంచి ‘నోటా’ ను మినహాయించాలని.. లోక్‌సభ, శాసనసభ వంటి ప్రత్యక్ష ఎన్నికల్లో మాత్రమే నోటాను వినియోగించాలని సుప్రీంకోర్టు తీర్పు ఆగస్టు 21న సూచించిన సంగతి తెలిసిందే. కేవలం ప్రత్యక్ష ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకునే ఓటర్ల కోసం మాత్రమే ‘నోటా’ ను అందుబాటులో ఉంచాలని కోర్టు వ్యాఖ్యానించింది.