కన్న కూతురిపైనే తండ్రి లైంగిక దాడి

రానురాను మనుషులు మృగాల్లా మారుతున్నారు. కామంతో కళ్ళు మూసుకుపోయి కన్న కూతురిపైనే లైంగిక దాడికి పాల్పడ్డాడు ఓ తండ్రి. గుంటూరు జిల్లాలోని తాడికొండ గ్రామంలో ఈ సంఘటన చోటుచేసుకుంది . షేక్‌ నాగుల్‌ బీ అనే మహిళ తన భర్త రహ్మల్‌‌తో కలిసి గ్రామంలో జీవిస్తుంది. వీరికి ఇద్దరు ఆడ పిల్లలు, ఒక మగబిడ్డ సంతానం. అయితే భర్త సైకో ప్రవర్తన కారణంగా షేక్‌ నాగుల్‌ అతనికి దూరంగా ఉంటుంది. కొంతకాలం తర్వాత మనస్సు మార్చుకున్న రహ్మల్‌ తాడికొండలో తిరిగి భార్యతో కలిసి ఉంటున్నాడు. కానీ అతని సైకో బుద్ది మాత్రం మారలేదు. ఈ నెల మూడో తేదీన పాఠశాల నుంచి వచ్చిన పెద్ద కుమార్తె (7) ను తినుబండారాలు కొనిపిస్తానంటూ బయటకు తీసుకెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డాడు. అక్కడినుంచి గుంటూరుకు వెళ్లిపోయిన రహ్మల్‌ ఇంటికి తిరిగిరాలేదు. కూతురు తరచూ నడుము నొప్పి, కడుపు నొప్పి అంటుండటంతో తల్లి ఆమెను గుంటూరు జీజీహెచ్‌కు తీసుకెళ్లింది. బాలికను పరీక్షించిన వైద్యులు బాలిక లైంగిక దాడికి గురైందని చెప్పడంతో ఆమె విస్తుపోయింది. కుమార్తెను ఏమి జరిగిందని నీలదీయగా తండ్రే తనను బయటకు తీసుకెళ్లి లైంగిక దాడి చేశాడని తెలపడంతో ఆమె పోలీసులను ఆశ్రయించింది. దీంతో పోలీసులు నిందితుడిపై ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు