పోలీసులను ఆశ్రయించిన ‘తమ్ముడు’ హీరోయిన్..

heroine-preeti-jhangiani-lodges-police-complaint

నరసింహనాయుడు, తమ్ముడు హీరోయిన్ ప్రీతీ జంగనియా గుర్తుండే ఉంటుంది.. ఆ రెండు చిత్రాలు సూపర్ డూపర్ హిట్ అవ్వడంతో ఆమెకు ఆవాసకాలు వెల్లువలా వచ్చాయి. కానీ అడపా దడపా చిత్రాల్లో నటించి తదుపరి బాలీవుడ్ కు షిఫ్ట్ అయింది. ఆ తరువాత ముంబై వాసిని పెళ్లి చేసుకుని అక్కడే సెటిల్ అయింది. తాజాగా ఓ వివాదం నేపథ్యంలో ప్రీతీ పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కింది. వారు నివాసం ఉండే అపార్ట్‌మెంట్‌లో పిల్లలంతా కలిసి ఆడుకునే సమయంలో పిల్లల మధ్య గొడవ జరగగా.. ఓ వృద్ధుడు తన కొడుకుపై చేయి చేసుకోవటంతో పాటు అపార్ట్‌మెంట్‌ నుంచి బయటకు గెంటివేశారంటూ ఆమె ముంబై పోలీసులకు ఆమె ఫిర్యాదు చేశారు. దాంతో ఇరుకుటుంబాలను పిలిచి సర్ది చెప్పి పంపించే ప్రయత్నం చేశారు. కానీ ఆమె ససేమీరా అనడంతో కుటుంబసభ్యులు ప్రీతిని ఒప్పించి కేసు వెనక్కి తీసుకున్నారు.