బుడుగుని చూసి పారి పోయిన పిడుగు..

బుడుగుని చూసి పిడుగు పారిపోయింది.. ఇంటి మీద పిడుగు పడింది. ఇంట్లో వస్తువులన్నీ కాలిపోయాయి. ఉయ్యాల్లో ఉన్న పిల్లాడు మాత్రం నాకేం తెలియదన్నుట్లు హాపీగా నిద్రపోతున్నాడు. విశాఖపట్నం జిల్లా సబ్బవరానికి చెందిన సాయినగర్ కాలనీలో నక్క దేవప్రసాద్, సారూమ్ దంపతులు నివసిస్తున్నారు.

వీరికి ఏడాదిన్నర కుమారుడు రంజిత్ ఉన్నాడు. మంగళవారం సాయింత్రం తల్లి, పిల్లవాడిని ఊయలలో పడుకోబెట్టి ఊపుతోంది. ఒక్కసారిగా ఉరుములతో కూడిన పెద్ద వర్షం పడింది. ఆ సమయంలోనే వారి ఇంటిమీద పిడుగు పడింది. దాంతో ఇంట్లోని విద్యుత్ పరికరాలన్నీ కాలిపోయాయి. ఆఖరికి బిడ్డ ఊగుతున్న ఊయల తాడు సైతం తెగిపోయింది.

ఇంట్లోని నేల కూడా కుంగిపోయింది. కానీ ఊయలలోని బిడ్డతో పాటు పక్కనే ఉన్న తల్లికి మాత్రం ఏమీ కాలేదు. ఇంటి మీద పిడుగు పడిన విషయం తెలుసుకుని కంగారుగా వచ్చిన బాబుతండ్రి ప్రసాద్ బిడ్డ, భార్య సురక్షితంగా ఉన్నారని తెలుసుకుని ఊపిరి పీల్చుకున్నాడు. మృత్యుంజయులైన తల్లీ, బిడ్డను చూసేందుకు స్థానికులు క్యూ కడుతున్నారు.