జియో నుంచి మరో బంపరాఫర్.. పుట్టినరోజు కానుక

వినియోగదారులను ఆకర్షించడానికి జియో తాజాగా మరో బంపర్ ఆఫర్‌ని ప్రకటించింది. ఫోన్‌పే యాప్ ద్వారా రూ.300 లేదా అంతకన్నా ఎక్కువ పే చేసి రీఛార్జి చేసుకుంటే రూ.50 క్యాష్‌బ్యాక్ పొందుతారని జియో తెలిపింది. రీఛార్జి చేసుకున్న 24 గంటల్లో ఈ క్యాష్‌బ్యాక్ తమ యాప్ వాలేట్‌లో క్రెడిట్ అవుతుంది. క్రెడిట్ అయిన ఈ క్యాష్ బ్యాక్‌ను వినియోగదారులు ఇతర రీఛార్జిలకు లేదా ఏదైనా బిల్ పేమెంట్స్‌కు ఉపయోగించుకోవచ్చు. తాజాగా ప్రవేశపెట్టిన కొత్త ఆఫర్‌తో వినియోగదారులు ఉచిత అపరిమిత కాల్స్‌, రోజుకు 100 మెసేజ్‌లు పంపుకొనే అవకాశం ఉంది. రూ.100 డిస్కౌంట్‌ ప్లాన్‌లో రెండు ఆప్షన్లు ఉన్నాయి. ఈ నెల 21 వరకు మాత్రమే ఈ ఆఫర్ అందుబాటులో ఉంది.