కాంగ్రెస్‌‌లో చేరిన మాజీ ఎమ్మెల్యే

తెలంగాణలో కేసీఆర్‌ కుట్ర రాజకీయాలకు తెరలేపారని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. గాంధీభవన్‌లో పలువురు టీఆర్‌ఎస్‌ నేతలకు కండువాకప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కాంగ్రెస్‌ నేతలపై కక్షపూరితంగా కేసులు పెట్టి.. ఇబ్బంది పెడితే సహించబోమనిహెచ్చరించారు.

తెలంగాణలో నేతల కప్పదాట్లు కొనసాగుతున్నాయి. కొందరు టీఆర్‌ఎస్‌ నాయకులు కాంగ్రెస్‌లో చేరారు. తాండూరుకు చెందిన పైలట్‌ రోహిత్‌రెడ్డి, మల్కాజ్‌గిరి మాజీ ఎమ్మెల్యే ఆకుల రాజేందర్‌, జడ్చర్లకు చెందిన పారిశ్రామికవేత్త అనిరుధ్‌ రెడ్డి.. కాంగ్రెస్‌ తీర్థం పుచ్చుకున్నారు.

కేసీఆర్ కుట్ర రాజకీయాలకు తెరతీశారని ఉత్తమ్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ నాయకులపై అక్రమ కేసులు బనాయిస్తే ఖబడ్దార్‌ అని హెచ్చరించారు. జగ్గారెడ్డి కన్నా ముందు, మనుషుల అక్రమరవాణా కేసులో కేసీఆర్, హరీశ్‌రావు పేర్లు ఉన్నాయని ఆరోపించారు. రాబోయేది తమ ప్రభుత్వమని, ఏ ఒక్కర్నీ వదలబోమని వార్నింగ్ ఇచ్చారు.