విశాఖలోని సీసీఎస్‌లో లాకప్‌ డెత్‌ కలకలం..?

lockup death

విశాఖలోని సీసీఎస్‌లో లాకప్‌ డెత్‌ జరిగిందన్న వార్తలు సోషల్‌ మీడియాలో కలకలం రేపాయి. వెంటనే లాకప్‌ డెత్ వార్తలపై నగరపోలీస్‌ కమిషనర్‌ విచారణకు ఆదేశించారు. విజయనగరానికి చెందిన గొర్లె పైడిరాజు అనే పాత నేరుస్తుడ్ని ఓ దొంగతనం కేసులో అనుమానితుడిగా ఈ నెల 9న పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

పదో తేదీన బంద్‌ కావడంతో.. నిబంధనల ప్రకారం స్టేషన్‌ కస్టడీలో ఎవరినీ ఉంచకూడదని అతడ్ని విడిచిపెట్టామని జాయింట్‌ సీపీ నాగేంద్ర వివరణ ఇచ్చారు. ఆ తరువాత ఏం జరిగిందో తమకు తెలియదంటున్నారు.