మీ అమ్మాయి మాకొద్దు.. ఎక్కువ సేపు దానితోనే..

టెక్నాలజీ మనుషులను దూరం చేస్తోంది. పొద్దున్న లేస్తే ఫోన్‌తోనే జీవనం. బంధాలు, అనుబంధాలు అన్నీ వాట్సప్, ఫేస్‌బుక్కులోనే. అన్నీ ఆన్‌లైన్‌లోనే దొరుకుతున్నట్టు వాటిని కూడా కొనుక్కోవలసిన పరిస్థితి వస్తుందేమో. యూపీలోని నౌగావ్ సాదత్ అనే గ్రామానికి చెందిన అబ్బాయికి పెళ్లి చేద్దామని అమ్మాయిని చూశారు. ఇద్దరికీ ఒకరికి ఒకరు నచ్చారు. పెళ్లికి ముహూర్తాలు కూడా పెట్టుకున్నారు.

పెళ్లికి కొద్దిరోజులు టైమ్ ఉండడంతో ఒకరికి ఒకరు ఇంకా బాగా తెలుసుకునే ప్రయత్నం చేసారు. టెక్నాలజీని బాగా వాడేస్తోందన్న విషయాన్ని పసిగట్టారు అబ్బాయి తరపు వారు. పెళ్లయితే తగ్గిపోతుందేమోలే అని సర్థిచెప్పుకున్నారు. ముహూర్తం సమయం రానే వచ్చింది. అమ్మాయిని అలంకరించి ఉంచారు బంధువులు. పెళ్లి కొడుకు తరపు వాళ్లు గానీ, పెళ్లి కొడుకు వస్తున్న జాడ గానీ కనిపించలేదు. ముహూర్తం దగ్గర పడుతుందంటూ ఫోన్ చేస్తే ఈ పెళ్లి మాకొద్దు మీ అమ్మాయి ఎప్పుడు చూసినా ఫోన్ పట్టుకునే ఉంటుంది.

రేపు పెళ్లయ్యాక మా అబ్బాయిని పట్టించుకుంటుందో లేదో.. అందుకే ముందే జాగ్రత్తపడుతున్నామంటూ చెప్పారు. వారు చెప్పిన విషయం విని అవాక్కయిన అమ్మాయి తండ్రి ఉరోజ్ మెహంది కోరినంత కట్నం ముట్టజెప్పనందునే వాట్సాప్ సాకుగా చూపిస్తున్నారని పోలీసులకు ఫిర్యాదు చేసాడు. రూ. 65 లక్షల కట్నం అడిగితే అందులో కొంత ఇచ్చామన్నారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.