‘మసక్కలి’ ఆ కోణంలో ‘అర్జున్ రెడ్డి’ లా..

సమాజాన్ని తన కోణంలో చూసే అమ్మాయి కథగా వస్తోన్న సినిమా మసక్కలి. ఒక అమ్మ కోణంలో అర్జున్ రెడ్డి సినిమాను చూస్తే ఎలా ఉంటుందో మా సినిమా అలా ఉంటుంది. మసక్కలి అంటే స్వచ్ఛమైనది అని అర్థం. ఒక అమ్మాయిని, సమాజాన్ని అంత స్వచ్ఛంగా ప్రేమించిన అబ్బాయి ఆ అమ్మాయిల మధ్య సాగే కథ ఇది. కొన్ని కథలు విని నమ్ముతాం.. కొన్ని కథలు చూసి నమ్ముతాం.. మరికొన్ని కథలు చూసినా నమ్మలేని విధంగా ఉంటాయి.. అలాంటిదే నా ఈ కథ అంటున్నాడు మసక్కలి దర్శకుడు నబి యేనుగుబాల.

ఈ సినిమాలో అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ మిక్స్ అయి ఉన్నాయి. మంచి కామెడీతో పాటు రొమాన్స్ కూడా ఉంటుంది. కానీ ఏదీ కథను దాటి వెళ్లదు. అబ్బాయి మాత్రమే అమ్మాయిని ప్రేమిస్తాడు. కానీ అమ్మాయి అతన్ని ప్రేమించదు. ఆ కుర్రాడు సైకాలజీ స్టూడెంట్ గా ఓ డాక్టర్ వద్ద అసిస్టెంట్ గా ఉంటాడు. ఆ డాక్టర్ ఇచ్చిన ఓ కేస్ ను ఛేదించే క్రమంలో అతనికి ఓ అమ్మాయితో పరిచయం ఏర్పడుతుంది. ఈ పరిచయం ఎలాంటి పరిణామాలకు దారితీసింది. ఈ అమ్మాయి ద్వారా తన ప్రేమను ఎలా గెలుచుకున్నాడు అనేది కథ. అందమైన విజువల్స్ తో పాటు మంచి సంగీతం ఉన్న ఈ సినిమా ఖచ్చితంగా విజయం సాధిస్తుందని ఆశభావం వ్యక్తం చేశారు దర్శకుడు నబి యేనుగుబాల.

డూ గూడ్ ఫాలో రైట్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై రూపొందుతోన్న ఈ మూవీకి మిహిరామ్స్ సంగీతం అందించారు. సాయి రోనక్, శ్రావ్య, శిరీషా వంకా నటించిన ఈ మూవీకి అరుణ్ చిలువేరు బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అందించారు.

-ADVT-