వరినాట్లు వేసిన కొత్త దంపతులు

minsiter akilapriya meets farmers in karnool distric

మంత్రి అఖిలప్రియ, భార్గవ్ రామ్ వివాహం ఇటీవల జరిగిన సంగతి తెలిసిందే. పండగ సందర్బంగా ఆళ్లగడ్డకు విచ్చేసిననూతన దంపతులు అలా పొలానికి వెళ్లారు. ఈ సందర్బంగా దంపతులు ఇద్దరు వరినాట్లు వేశారు. రుద్రవరం గ్రామ సమీపంలోని రైతు పొలంలో మంత్రి, ఆమె భర్త వరినాట్లు వేశారు. కాసేపు కూలీలతో వారు మాటామంతీ కలిపి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. అంతేకాకుండా ఎకరాకు ఎంత కూలీ ఇస్తున్నారు? అవి సరిపోతున్నాయా అని అడిగారు. కొత్తదంపతులు ఇలా వరినాట్లు వేయడంతో అక్కడున్న రైతులు సంతోషం వ్యక్తం చేశారు.