చెన్నూరు టికెట్ నల్లాల ఓదెలుకు ఇవ్వాలంటూ సూసైడ్ అటెంప్ట్‌

Nallala Odelu

చెన్నూరు టికెట్ నల్లాల ఓదెలుకు ఇవ్వాలంటూ మంచిర్యాల జిల్లా ఇందారంలో చేపట్టిన నిరసన ఉద్రిక్తతకు దారి తీసింది. స్థానికంగా బాల్క సుమన్ ప్రచారాన్ని ఓదేలు అనుచరులు అడ్డుకున్నారు. గట్టయ్య అనే ఓ కార్యకర్త ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పు పెట్టుకున్నాడు.

chennuru

దీంతో మంటలు అతనితోపాటు మరో నలుగురికి అంటుకున్నాయి. అందరినీ హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. వీళ్లలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. సుమన్‌కి టికెట్ కేటాయించడాన్ని నిరసిస్తూ వీరంతా ఆందోళనకు దిగారు. ఓదెలు అనుచరుడి సూసైడ్ అటెంప్ట్‌తో ప్రస్తుతం అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.