వీడియో వైరల్ … పట్టిసీమ ప్రాజెక్టు వద్ద బ్రాహ్మణితో లోకేశ్ సెల్ఫీలు

ఏపీ ముఖ్యమంత్రిగా చంద్రబాబునాయిడు, మంత్రిగా లోకేష్ బాధ్యతలు చెపట్టిన తర్వాత వారు ఫ్యామిలీకి కేటాయిస్తున్న సమయం చాలా తక్కువ. అయిన అప్పుడప్పుడు కుటుంబ సభ్యులతో కలిసి వివిధ కార్యక్రమాలకు హాజరవుతున్నారు. తాజాగా పోలవరం స్పిల్‌ వే నిర్మాణంలో భాగమైన గ్యాలరీని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బుధవారం ప్రారంభించారు.ఈ సందర్భంగా చంద్రబాబు తన కుటుంబసభ్యులతో కలిసి గ్యాలరీని సందర్శించారు. ఈ కార్యక్రమంలో దేవాన్ష్‌తో పాటు లోకేష్, బ్రాహ్మణిల జంట కూడా అందర్నీ ఆకర్షించింది. వారీద్దరూ కలిసి ప్రాజెక్ట్ వద్ద సెల్ఫీలు తీసుకుంటున్నప్పుడు తీసిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇంత అందమైన ప్రదేశాన్ని బ్రాహ్మణితో కలిసి సందర్శించడం చాలా సంతోషంగా ఉందని లోకేష్‌ ట్విట్టర్ ద్వారా తెలిపారు. కొద్దిరోజుల క్రితం లోకేష్ సతీమణి బ్రహ్మణికి వివాహ మహోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ సముద్రపు ఒడ్డున బ్రహ్మణితో ఉన్న ఓ ఫొటోను ఆయన ట్వీట్‌కు జత చేశారు. అప్పట్లోను ఆ ఫోటో సామాజిక మాధ్యమాలలో వైరల్ గా మారింది.