ముగ్గురితో ప్రేమ.. అది నా ఇష్టం.. : సైరా భామ

వెండి తెరపై లేడీ సూపర్‌స్టార్‌గా తన హవా కొనసాగిస్తున్న అందాల తార నయనతార. కోలీవుడ్‌లో స్టార్ హీరోలతో సమానంగా రెమ్యునరేషన్ అందుకుంటున్న ఏకైక ముద్దుగుమ్మ నయన్. ఎప్పటికప్పుడు సరికొత్త పాత్రలతో సూపర్ స్టార్ అనిపించుకుంటూ.. లేడీ ఓరియెంటెడ్ మూవీస్‌లో నటిస్తూ జోరుగా , హుషారుగా వెండితెరపై సక్సెస్‌పుల్‌గా దూసుకెళ్తోంది. కానీ ఆమె వ్యక్తిగత జీవితంలో లవ్ ఎపిసోడ్ సముద్రంలోని కెరటంలా ఎగిరెగిరి పడుతోంది.

నయన్ ఇప్పటికి ముగ్గురితో సాగించిన ప్రేమాయణం ఇంకా పెళ్లికి దారితీయలేదు. కొన్నాళ్ల కిందట శింబుతో సాగించిన ప్రేమ నయన్‌ను డిప్రెషన్‌కి గురిచేసింది. అనంతరం ప్రభుదేవాతో నడిచిన లవ్‌జర్నీకి మధ్యలోనే బ్రేక్ పడింది. ఇప్పుడు ముచ్చటగా మూడోసారి ప్రేమలో నయన్ మునిగి తేలుతున్నట్లు వదంతులు వినిపిస్తున్నాయి. గత కొన్ని రోజులుగా దర్శకుడు విఘ్నేష్ శివన్ తో ప్రేమాయణం కొనసాగిస్తున్నట్లు సినీ ఇండ్రస్టీ టాక్. అంతేకాదు ఇటీవల ఆమె విఘ్నేష్ ని రహస్యంగా పెళ్లి చేసుకుందనే వార్త కూడా చిత్రపరిశ్రమలో చక్కర్లు కొడుతోంది.

తన ప్రేమ, పెళ్లి విషయాలపై నయన్ స్పందిస్తూ.. నమ్మకం లేని చోట ప్రేమ నిలవలేదు. ఆ ఇద్దరికీ(శింబు, ప్రభుదేవా) నాకు మధ్య మిస్ అండర్ స్టాండింగ్స్ వచ్చాయి. వాటి కారణంగా ఒకరి మీద ఒకరికి నమ్మకం కోల్పోయే పరిస్థితి ఏర్పడింది. ఆ స్థితిలో కలిసి ఉండడం కన్నా విడిపోవడమే బెటర్ అనుకున్నాను. అందుకే వారినుంచి విడిపోయాను. కానీ ఈ సారి నాకు గట్టి నమ్మకం ఉంది. నేను నమ్మిన వ్యక్తి నాకు జీవితాంతం తోడు ఉంటారు.

విఘ్నేష్‌తో లవ్ ట్రాక్ గురించి చెబుతూ.. ప్రస్తుతం పెళ్లి గురించి ఆలోచించేంత సమయం లేదు. నా పెళ్లి అందరికీ చెప్పి చేసుకోవాలని అనుకోవడం లేదు. ప్రేమ, పెళ్లి నా వ్యక్తిగత విషయాలు. వాటిని షేర్ చేసుకోవలసిన వారితోనే చేసుకుంటాను తప్ప అందరితో పంచుకోలేను అంటూ తన మనసులోని మాటను బయటపెట్టింది అందలా ‘సైరా భామ’ నయన్.