‘అరవింద సమేత వీరరాఘవ’ లో మెగాస్టార్?

ntr-jr-returns-aravinda-sametha-sets

యంగ్ టైగర్ ఎన్టీఆర్ తాజా చిత్రం ‘అరవింద సమేత వీరరాఘవ’ త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని హారికా హాసినీ క్రియేషన్స్‌ బ్యానర్‌పై యస్‌. రాధాకృష్ణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్ దశలో ఉంది. ప్రస్తుతం పాటల చిత్రీకరణ జరుగుతోంది. పాటలు మినహా షూటింగ్ పూర్తయినట్టు తెలుస్తోంది. ఇదిలావుంటే ఈ సినిమాకు సంబంధించి ఫిలిం నగర్లో ఓ ఇంట్రెస్టింగ్ వార్త హల్చల్ చేస్తోంది. ఇందులో బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ నటించనున్నట్టు ఆ వార్త సారాంశం.. గతంలో ‘మనం’ ప్రస్తుతం ‘సైరా’లో కీలక రోల్ లో చేస్తున్న అమితాబ్ ఈ సినిమాలో కూడా ఓ పవర్ ఫుల్ క్యారెక్టర్ లో నటిస్తున్నారని రూమర్లు తెగ హల్చల్ చేస్తన్నాయి. అయితే ఈ వార్తలో నిజమెంతో తెలియాలంటే అఫీసియల్ ప్రకటన రావలసిందే. కాగా ఈ చిత్రంలో పూజా హెగ్డే కథానాయికగా.. ఇందులో జగపతిబాబు, ఈషా రెబ్బా, నాగబాబు ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. అక్టోబర్‌ 10న రిలీజ్‌ కానున్న ఈ చిత్రానికి సంగీతం: యస్‌.యస్‌. తమన్, కెమెరా: పీయస్‌ వినోద్‌.