స్వగ్రామానికి చేరుకున్న పృధ్విరాజ్‌ మృతదేహం

prudvi raj

అమెరికాలోని కాల్పుల్లో మృతి చెందిన పృధ్విరాజ్‌ మృత దేహం ఇవాళ తెనాలికి చేరుకుంది. కాలిఫోర్నియాలోని సిన్సినిట్‌ బ్యాంక్‌లో 25 ఏళ్ల పృధ్విరాజ్‌ పనిచేసేవాడు. గత గురువారం కాల్పుల్లో మృతి చెందారు. వారం రోజుల తరువాత పృధ్వి మృత దేహం స్వగ్రామానికి చేరుకుంది. కుమారుడి మృత దేహాన్ని చూడగానే తల్లి దండ్రులు కన్నీరు మున్నీరు అవుతున్నారు.. వారిని ఓదార్చడానికి వచ్చిన బంధువులు, గ్రామస్థులు సైతం కన్నీరు పెడుతున్నారు.. దీంతో తెనాలిలో విషాద చాయలు నెలకొన్నాయి.