చంద్రబాబు లుక్‌లో రానా.. ఫస్ట్‌లుక్ రిలీజ్

ప్రముఖ రాజకీయ నాయకుడు, సీని నటుడు యన్‌టీఆర్‌ జీవిత చరిత్ర అధారంగా తెరకెకుతున్న చిత్రం ‘యన్‌టీఆర్‌’. ఈ సినిమాలో దగ్గుపాటి రానా ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా చిత్ర యూనిట్ చంద్రబాబు లుక్‌లో ఉన్న రానా పోస్టర్‌ను విడుదల చేసింది. రానా తన ట్వీటర్ ఖాతాలో ఈ ఫోటో జత చేస్తూ పోస్టు పేట్లారు.1984లో చంద్రబాబు లుక్‌ ఇలా ఉండేది అంటూ దానికి క్యాప్షన్ జత చేశారు ఈ చిత్రంలో ఎన్టీఆర్‌ పాత్రలో బాలకృష్ణ నటిస్తుండగా, ఆయన సతీమణి బసవతారకం పాత్రలో విద్యా బాలన్‌ నటిస్తున్నారు. ఈ చిత్రానికి క్రిష్‌ దర్శకత్వం వహిస్తున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతికి సినిమా విడుదల చేయనున్నారు. తెలుగుతో పాటు తమిళం, హిందీలోనూ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.

Recommended For You

Leave a Reply

Your email address will not be published.

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.