హీరోయిన్ నిశ్చితార్థం రద్దు..

rashmika engagement stops

చలో.. గీతగోవిందం సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకుంది రష్మిక.. కేరీర్ పీక్ స్టేజిలో ఉండగానే స్నేహితుడు రక్షిత్‌ ను ప్రేమించి వివాహానికి కూడా సిద్ధమైంది. ఇద్దరికీ నిశ్చితార్థం కూడా జరిగింది. ఏమైందో ఏమో కానీ ఇటీవల వీరి నిశ్చితార్థం రద్దయినట్టు వార్తలు వచ్చాయి. తాజాగా నిశ్చితార్థం రద్దు విషయంపై రష్మిక అమ్మ.. సుమన మాట్లాడారు. ‘ప్రతి ఒక్కరికీ జీవితం చాలా ముఖ్యమైంది. ఎదుటి వ్యక్తి బాధపెడితే ఎవరికీ ఇష్టం ఉండదు. ప్రతి ఒక్కరు సంతోషంగా ఉండాలి. కొన్ని సమస్యలతో మా కుటుంబం డిస్టర్బ్‌ అయింది. ప్రస్తుతం కోలుకుంటున్నాం’ అంటూ ఆమె తెలియజేసింది. దీంతో ఆమె రష్మిక తల్లే ఈ విషయంపై స్పష్టం చేయడంతో వారిద్దరి నిశ్చితార్థం రద్దయినట్టు తెలుస్తోంది. మరోవైపు ఈ దీనిపై ఎవరు ఏమి మాట్లోదంటూ రక్షిత్‌ సోషల్ మీడియా వేదికగా కోరాడు.